![]() |
![]() |
.webp)
ఢీ జోడి షోలో అశ్విని శ్రీ- ఆది, సోనియా-సిద్దు మధ్య ఈ వారం గట్టిగానే ఫైట్ అయ్యింది. షోకి రావడంతోనే అశ్విని ఆది మీద కంప్లైంట్ చెప్పింది. "ఆదిని పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఒక ముద్దు లేదు ముచ్చటా లేదు" అనేసింది. "నేను ముద్దు అడిగితే నువ్వు ఏమన్నావ్ మా అత్త అక్కడే కూర్చుంటుంది ఇవ్వడం కుదరదు అన్నావ్ కదా" అన్నాడు ఆది. తర్వాత స్టేజి మీదకు వచ్చిన సోనియా-సిద్ధుని చూసి ఆది కామెంట్స్ చేసాడు. "థియేటర్ ముందు మీ ఆవిడ ఇచ్చే రివ్యూస్ చాలా బాగుంటాయండి" అంటూ సోనియా గురించి చెప్పేసరికి సిద్దు ఒక రేంజ్ లో చూసాడు. తర్వాత సోనియా టీమ్ నుంచి డాన్స్ కంటెస్టెంట్స్ సూర్య తేజ - హంసను పంపించారు.
"రేయ్ ఆది పేర్లు వినగానే తడిసిపోయిందా..ఐనా నువ్వెందుకురా ఇక్కడికి వచ్చి రోజూ..నోరు ముయ్యి " అని సోనియా ఆదిని టీజ్ చేసింది "చూసుకుందామా మా సైడ్ నుంచి చారి మాస్టర్ వస్తున్నాడు..ఐనా ఈ తెల్ల పందికొక్కును ఎవడురా షోకి తీసుకొచ్చింది " అన్నాడు ఆది కూడా. ఆ మాటకు సోనియా "ఏంటి మీ ఆవిడని తెల్ల పందికొక్కు అనడానికి సిగ్గు లేదు" అని అశ్వినిని సేవ్ చేయడానికి అన్నట్టుగా డైలాగ్ వేస్తె "ఏ చిరిగిపోయిన ప్యాంటు సైలెంట్ గా ఉండు" అంటూ అశ్విని సోనియా మీద రివర్స్ అయ్యింది. ఇక లాస్ట్ లో సోనియా సైడ్ నుంచి వెళ్లిన జోడి ఇరగదీసేసరికి "నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ కి ఎగరేసి తంతా" అని వార్నింగ్ ఇచ్చాడు ఆది. ఆది ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడని అందరినీ తిట్టేస్తున్నాడని తెలుసుకున్న సోనియా "ఎవరైనా కొంచెం హెల్ప్ చేయండి..ఆదికి తడిసిపోయినట్టు ఉంది...ఎవరైనా డైపర్ వేయించండి. " అన్నది. "ఆల్రెడీ మీ సిద్దు డైపర్ వేసుకున్నాడు..అది తీసేయ్ ఫస్ట్" అని రివర్స్ కౌంటర్ వేసాడు ఆది. "నోరు ముయ్యరా ఆది" అన్నది సోనియా.
![]() |
![]() |